ఎకాన‌మీని నిల‌బెట్టాలంటే ఇది త‌ప్ప‌డు

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ చేయ‌టంతో దేశంలోని ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మూత ప‌డ్డాయి. మ‌నుషులు బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దాంతో ఇప్ప‌టికే వెనుక‌ప‌ట్టులో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర కుంగుబాటుకు లోన‌య్యే ప‌రిస్థితి ఉంద‌నే భ‌యాలు వ్య‌క్త‌మ‌తున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌ల ఆదాయాలు పూర్తిగా ఆగిపోతే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో స‌మిష్టి డిమాండ్ ఒక్క‌సారిగా ప‌డిపోతుంది. అదే జ‌రిగితే ఆర్థిక వ్య‌వ‌స్థ మాంద్యంలోకి వెళ్లిపోతుంది. ఈ ప‌రిస్థితిని నివారించేందుకు ప్ర‌భుత్వంతోపాటు దేశంలోని చిన్న‌చిన్న కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద యంత్ర ప‌రిక‌రాల త‌యారీ సంస్థ‌ల వ‌ర‌కు ఉద్యోగులు ప‌నిచేయ‌కున్నా జీతాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఏప్రిల్ త‌ర్వాత కూడా కొన‌సాగితే ప‌రిస్థితి ఏంట‌నే భ‌యాలు ఇప్పుడు ప్ర‌భుత్వంతోపాటు పారిశ్రామిక సంస్థ‌ల‌ను వెంటాడుతున్నాయి.