ముంబైకి చెందిన సౌమి కుమార్తె జామ్‌లు తిన్నప్పుడల్లా అనారోగ్య సమస్యలు తలెత్తేవి. అవి తిన్న సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో ఆరా తీసేందుకు వైద్యుణ్ణి సంప్రదించింది. అప్పుడు తెలిసింది ఆ చిన్నారి తినే జామ్‌లో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల పలు వ్యాధులకు గురవుతున్నట్లు తేలింది. తన కుమార్తెలా మరెవరూ బాధపడకూడదనుకున్నది సౌమి. అందుకోసం సహజసిద్ధమైన జామ్‌లను రూపొందించేందుకు సిద్ధమైంది. సౌమి చిన్నతనంలో వాళ్ల అమ్మమ్మ పలురకాల పండ్లతో ఎటువంటి రసాయనాలు లేకుండానే జామ్ తయారు చేసేది. అదే పద్ధతిలో సౌమి కూడా జామ్‌లను తయారు చేయడం మొదలుపెట్టింది. స్ట్రాబెర్రీలతో రూపొందించిన జామ్‌ను తన స్నేహితులకు, దగ్గరి బంధువులకూ పంపింది. వారు సౌమి తయారు చేసిన జామ్‌లు ఎంతో రుచిగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఆమెను మరిన్ని ప్లేవర్స్ తయారు చేయమని, వాటిని తామే కొనుగోలు చేస్తామంటూ ప్రోత్సహించారు. అలా సౌమి రూపొందించిన జామ్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరిగింది.
చిన్నారుల బాగుకోసం..