భారత్, అమెరికా మైత్రి 21వ శతాబ్దంలో ‘అతి ముఖ్యమైన భాగస్వామ్యాలలో ఒకటని’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్వైపాక్షిక, రక్షణ, భద్రత సహకారం ఈ వ్యూహాత్మక బంధంలో కీలకమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో విస్తృత స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య సానుకూల చర్చలు జరిగాయని మోదీ తెలిపారు. ‘మంత్రులు అంగీకారానికి వచ్చిన అవగాహన ఒప్పందానికి చట్టరూపు ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్, నేను నిర్ణయించాం. భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం.
శతాబ్దపు మైత్రి